ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నారు ఓ కవి. వారి మాటలే కాదు... చేతలు కూడా అర్థం కావు అంటున్నారు నేటి తరం కొందరు మహానుభావులు. ఎదుటి వారి ప్రవర్తన సరిగ్గా ఉన్నా వారి మూడ్ ని బట్టి ఏ సందర్భాల్లో ఎలా ఉంటారో వారికే అర్థం కాని స్థితిలో నేటి తరం అమ్మాయిలు ఉన్నారన్నది అక్షర సత్యం. ఇది మేము చెబుతున్నది కాదు. సర్వేలు చెబుతున్నాయి. స్వీడన్ యూనివర్సిటీకి చెందిన కేథరిన్ ఫిడెలియా అనే ప్రోఫెసర్ తన 45 మంది యువ విద్యార్థినుల పై ఓ సర్వే నిర్వహించింది. ఇంతకీ వారు తేల్చింది ఏంటీ... అమ్మాయిలతో మాట్లాడటం ఓ కళ. వారితో మాట్లాడేటప్పుడు కాస్త కళాత్మకత ప్రదర్శించాల్సి ఉంటుంది. లేకపోతే ఇక అంతే. వారితో అవసరమైనదానికన్నా ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. అందుకే ఎంతో నేర్పుతో, జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రశ్నలు వేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని ప్రశ్నలు సంధించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. అలాంటి వాటిలో కొన్ని...
నెగటివ్ కామెంట్లు...
ఆడవాళ్లకు నచ్చనిది ముఖ్యంగా ఇదే. మీది కష్టపడేతత్వం కాదేమో?... ఇలాంటి మాటలు సాధారణంగా వారికి చికాకు కలిగిస్తాయి. మహిళల్లో కష్టపడేతత్వం ఎక్కువే. దాన్ని విమర్శిస్తే, చిరాగ్గానే కాదు, బోరింగ్‌గా కూడా ఫీలవుతారు
పర్సనల్ విషయాల్లోకి తొంగి చూడకూడదు...
ఇలాంటి విషయాలు సాధ్యమైనంత వరకు మాట్లాడక పోవటమే మంచింది. ఎందుకంటే వారి వ్యక్తిగత విషయాలు ఎంత క్లోజ్ వారికైనా చెప్పాలని అనుకోరు. అలాగని చెప్పకుండా ఉండలేరు. అందుకే వారంతట వారుగా వ్యక్తపరిచేవరకు సైలెంట్ గా ఉంటే బెటర్.
అవసరమైతే మధ్యలో కట్ చెయ్యండి...
వారికి ఇష్టం లేని టాపిక్ లు అస్సలు మాట్లాడకండి. ఒకవేళ వారు ఇబ్బందిగా ఫీలైన, చికాకుగా మొహం పెట్టిన మధ్యలో అయినా సరే కట్ చెయ్యటం బెటర్. లేకపోతే మీకు కట్ అయిపోద్ది. రిలేషన్.
ఎక్కువ ఇంట్రస్ట్ చూపొద్దు...
ముందు తొలి చూపులోనే ఎవర్నయినా ఇష్టపడాలని అమ్మాయిలు అనుకోరు. ఎవరితో తమ జీవితం బాగుంటుందో ఊహించుకుంటారు. అలాంటి ఆడవాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఇంట్రస్ట్ చూపటం లాంటివి చేస్తే వారికి ఆటోమేటిక్ గా కాలుతుంది. దాంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
ఇప్పటివరకూ సరైన వ్యక్తిని కలవలేదెందుకు...
ఆల్రెడీ బాయ్‌ప్రెండ్‌తో బ్రేకప్ అయిన అమ్మాయిల్ని ఈ ప్రశ్న వేస్తే బాగానే ఉంటుందిగానీ, అలాంటి అనుభవాల్లేని అమ్మాయిలకు ఇది నిజంగానే చిర్రెత్తుకొచ్చే ప్రశ్నే. ఆ టైంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. వీలైతే మీ చెంపగానీ, పళ్లుగానీ రాలవచ్చు.
ఇవి కాకుండా, మనస్సులో ఏం దాచుకోకుండా, పైకి నటించకుండా, అడగాలనుకున్నది క్లియర్‌గా అడిగితే ఏ ఇబ్బందులు ఉండవు. అంతేగానీ నోరు జారితే మాత్రం కష్టం. ఇబ్బందికరంగా లేని ప్రశ్నల ద్వారా అమ్మాయిల మనసుల్ని గెలుచుకోవడం, వారి నుంచి సమాధానం తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆల్ ది బెస్ట్...