ఆడాళ్ల భద్రతను ప్రశ్నించే మరో ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. హోదా ఉన్నవారు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవారు మృగాళ్లుగా మారుతున్నారనడానికి మరో ఉదాహరణే ఈ ఘటన. దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ యువనటిని ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నిర్వాహకుడి పై ఆరోపణలు రావటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కిరాతకుడి నిర్వాకాలు విన్న పోలీసులు సైతం పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారట.
వివరాల్లోకి వెళితే, రవీందర్ లజపత్ నగర్ సమీపంలో నటనలో శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద ఓ మైనారిటీ తీరని బాలిక శిక్షణ పొందుతోంది. గత నెలలో షూటింగ్ నిమిత్తం వీరి టీమ్ ఫతేపూర్ బెరీ ప్రాంతానికి వెళ్లిగా, ఆ బాలికపై తన దుర్బుద్ధి చూపాడు. డాక్యుమెంటరీలు, యాడ్ ఫిల్మ్స్ లో అవకాశాలు ఉన్నాయని, తనకు సహకరిస్తే బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పాడు. బాలిక అంగీకరించకపోవడంతో బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ, దారుణంగా వేధించాడు. యూనిట్ నుంచి తీసేస్తానని బెదిరించాడు కూడా. ఈ మొత్తం ఘటనలను ఆ బాలిక ఢిల్లీకి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రవీందర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.