మూగజీవాలకు ‘ఆధారం’ ఇస్తున్నాడని అరెస్ట్ చేశారు

July 03, 2015 | 03:26 PM | 4 Views
ప్రింట్ కామెంట్
adhaar_card_for_dog_in_madhya_pradesh_niharonline

మూగ జీవాల మీద ప్రేమతో ఓ వ్యక్తి చేసిన పనికి పోలీసులు అతన్ని చెరసాల వెనక్కి నెట్టారు. అయితే అతను చేసింది మంచి పని అనుకుంటే మాత్రం పొరపాటే. దేశంలో ప్రస్తుతం ప్రజలు ఆధార్ కార్డ్ పొందేందుకు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. కానీ, మధ్యప్రదేశ్ లోని ఓ కుక్క మాత్రం ప్రభుత్వ గుర్తింపు కార్డును సులువుగా పొందటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బింద్ జిల్లాలోని అజంఖాన్ అనే వ్యక్తి తన కుక్కకు టామీ సింగ్ అనే పేరుతో ఆధార్ కార్డ్ తీసుకున్నాడని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. కార్డులో కుక్క ఫోటో, దాని కింద టామీ సింగ్ పేరు, సన్ ఆఫ్ శేరు సింగ్ అని ఉంది. ఇక  ఈ కుక్క గారి పుట్టిన తేదీ నవంబర్ 26, 2009 అని అందులో పేర్కొన్నారు. విషయం తెలిసిన స్థానిక పోలీసులు అజంను అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. అజం ఉమ్రి అనే ప్రాంతంలో ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఏజెన్సీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడట. ఈ క్రమంలో కుక్కులు, ఇతర జంతువులకు ఖాన్ ఏజెన్సీ అనే పేరిట ఆధార్ కార్డులు జారీచేస్తున్నాడట. ఫిర్యాదు అందటంతో పోలీసులు రంగంలోకి దిగి అతగాడిని అరెస్ట్ చేసి ఫోర్జరీ కేసు నమోదుచేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ