అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లొంగొపోతానంటూ సీబీఐకి మూడు సార్లు ఫోన్ చేశానని, ఇదే విషయాన్ని అప్పటి సీబీఐ డైరక్టర్ విజయరామారావుకు వివరించినా పట్టించుకోలేదని మాజీ డీఐజీ నీరజ్ చేసిన ప్రకటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ సీబీఐ డైరక్టర్ విజయరామారావు స్పందించారు. దావూద్ లొంగిపోతాడన్న సమాచారం అసలు తనకు తెలీనే తెలీదని, కేవలం ఛీప్ పబ్లిసిటీ కోసమే నీరజ్ ఇదంతా చేస్తున్నారని విజయరామారావు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టంచేశారు. సీబీఐ ఒక్కటే కాదు, దేశంలోని వివిధ దర్యాప్తు సంస్థలన్నీ దావూద్ కోసం విపరీతంగా గాలించాయని తెలిపారు. కాగా, ఆరోపణలు చేసిన నీరజ్ కాసేపటి క్రితం తాను అలా చెప్పలేదని బుకాయించటం కొసమెరుపు.