తగ్గించినట్టే తగ్గించి... పెను భారం వేశారు

May 01, 2015 | 03:01 PM | 141 Views
ప్రింట్ కామెంట్
petrol_price_hike_highly_in_modi_govt_niharonline

భారీగా తగ్గాయని ఆనందించే లోపే మోదీ ప్రభుత్వం పెద్ద బాంబును ప్రజల నెత్తిన వేసింది. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించడంలో సఫలమయ్యిందని సంబరపడేలోపే ఒక్కసారిగా ధరలను భారీగా పెంచేసింది. పెట్రోల్  పై 3.96 రూపాయలు, డిజీల్ పై 2.37 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ ముడి చమురు పెరిగిందన్న సాకుతో ఆయిల్ కంపెనీలు అమాంతంగా ఇంతింత ధరలను పెంచేశాయి. పెరిగిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పెట్రోలు ధరను పది విడతల్లో మొత్తంగా రూ. 17.11 తగ్గించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ డీజిల్ ధరను ఆరు విడతల్లో రూ. 12.96 తగ్గించారు.  ఏప్రిల్ 16వ తేదీన పెట్రోల్‌పై లీటరుకు 80 పైసలు, డీజిల్‌పై లీటరుకు 1.30 రూపాయలు తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏప్రిల్ 2వ తేదీన పెట్రోల్‌పై 46 పైసలు, డీజిల్‌పై 1.21 రూపాయలు తగ్గించారు. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు 63.16కి చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 49.57 కి పెరిగింది. హైదరాబాద్‌లో తాజా పెంపుతో లీటరు పెట్రోలు రూ.71.21, లీటరు డీజిల్ ధర రూ.56.04కు చేరింది. కాగా ఇది మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని క్లియర్ గా చేస్తుంది. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పై దుమ్మెత్తిపోయటం ప్రారంభించింది. ప్రజల నడ్డి విరిచే పనిని ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే చేసిందని విమర్శిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ