‘బస్ దో మినిట్...’కు చుక్కెదురు

June 03, 2015 | 02:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
maggie_noodles_ban_central_govt_niharonline

గత ముప్ఫై ఏళ్ళ నుంచి తమ ప్రకటనలతో టీవీల్లో హోరెత్తిన ‘బస్ దో మినిట్ ’ మాగీకి చుక్కెదురైంది. నెస్లే వారి మ్యాగీకి ఇన్నాళ్ళుగా దేశ వ్యాప్తంగా మంచి పేరు, గిరాకీ ఉన్నాయి. అది ఇప్పుడు ఒకేసారిగా కుప్ప కూలినట్లయ్యింది. ఎన్నో రోజులుగా మ్యాగీ న్యూడిల్స్ లో హాని కర రసాయనాలున్నాయంటూ చాపకింద నీరులా ప్రచారం జరుగుతున్నా... దీనికి గురించి పట్టించుకుని నిషేధం విధించడానికి ఇన్నాళ్ళ సమయం తీసుకుంది. ఒక్కో రాష్ట్రంలో నూడిల్స్ పై కేసులు దాఖలు కావడం... చివరికి ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెస్లే మ్యాగీ నూడిల్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. దేశ వ్యాపితంగా దీని అమ్మకాలను నిలిపి వేయాలని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొద్ది సేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేశారు.మ్యాగీ నూడిల్స్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని చెప్పిన పాశ్వాన్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ నూడిల్స్ లో హానికరమైన రసాయనాలున్నాయన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్, కేరళ, తాజాగా బీహార్ లో కూడా ఆ కంపెనీవారిపై, ఆ ప్రొడక్టుకు ప్రచార కర్తలుగా పనిచేస్తున్న వారిపై కేసులు నమోదయ్యాయి. కేరళ, ఉత్తర ప్రదేశ్ లో వాటి అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాగీ నూడిల్స్ పరీక్షలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు నిషేధం విధించడంతో నెస్లే షేర్లు విపరీతంగా పడిపోనారంభించాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ