వైవాహిక సంబంధంలో ఇద్దరి మధ్య జరిగే బలవంతపు కలయికను అత్యాచారంగా పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో స్పష్టంచేసింది. భర్త బలవంతంగా అనుభవిస్తే, అది అత్యాచారం కాదనే మినహాయింపు ఐపీసీలోని 375 సెక్షన్ లో ఉందని గుర్తుచేస్తూ, దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా? అని డీఎంకే సభ్యురాలు కనిమొళి వేసిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహయమంత్రి హరిభాయ్ చౌదరి సమాధానామిచ్చారు. భార్యకు ఇష్టం లేకుండా బలవంతపెడితే, అది విదేశాల్లో నేరమని, భారత్ లో నెలకొన్న భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని మనదేశంలో రేప్ గా నిర్వచించలేమని, చట్ట సవరణ ఆలోచనేమీ తాము చేయటం లేదని హరిభాయ్ వెల్లడించారు. మారిటల్ రేప్ ను నేరంగా చేస్తే, ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, భారత్ లో కుటుంబ విలువలకు ఇది విఘాతమని ఆయన వెల్లడించారు.