గుజరాత్ లో ఓ ఘోరం చోటుచేసుకుంది. ఫర్జానా అనే 22 ఏళ్ల యువతి తన భర్త ఫరూక్ ను కిరాతకంగా అంతమొదించింది. ఎందుకు చంపావని పోలీసులు ప్రశ్నించగా ఆమె చెప్పిన ఆన్సర్ కి పోలీసులు సైతం షాకయ్యారు. నల్లగా ఉన్నాడన్నా కారణం, అతనంటే అయిష్టతతోనే హత్య చేసిందట. కుటుంబ ఒత్తిళ్లతో రెండేళ్ల క్రితం అతనితో వివాహం జరిగిందని, అయితే అతను నల్లగా ఉన్నాడని దూరంగా ఉంచేందట. ఎలాగోలా పెద్దలు సర్దిచెప్పి కాపురం చేయిస్తున్నారట. కాగా, ఇటీవలె ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో పొలానికి వెళ్లిన ఆమెను కొరిక తీర్చాలని భర్త కోరాడట. అసలే అసహ్యాం ఆపై వాంఛ అంటూ వెంట పడటంతో పక్కనే ఉన్న ఓ సుత్తి తీసుకుని తల పగలకొట్టిందట. తీవ్రగాయాలు కావటంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసు విచారణలో ఆమె చెప్పిన విషయాలు అనుమానంగా తొచటంతో పోలీసులు లై డిటెక్టర్ నిర్వహిస్తామని బెదిరించారట. దీంతో ఆమె అసలు విషయాన్ని చెప్పిందట. కేసు నమోదు చేసుకుని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.