ఇకపై మార్పులు కఠినతరం

May 19, 2015 | 05:21 PM | 21 Views
ప్రింట్ కామెంట్
cbsc_niharonline

 ఏ వ్యక్తి అయినా తన పేరులోగాని, ఇంటిపేరులో గాని మార్పుకోసమో, లేదా తప్పుగా నమోదైన పుట్టిన రోజును తిరిగి సరి చేసుకోవడానికో ఒక అఫిడవిట్ ను సమర్పించి,  తరువాత ఏదైనా వార్తా పత్రికలో ఒక ప్రకటన ఇస్తే చాలు కావలసిన మార్పులు చేసుకోవటం ఇప్పటి వరకు సాధ్యమయ్యేది. ఇక నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ధ్రువీకరణ పత్రాల్లో మాత్రం ఈ మార్పులు చేర్పులు అంత సులభం కాదు. కోర్టు ఆదేశాలుంటేనే మార్పులకు అనుమతిస్తామని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. కేవలం ప్రకటన ద్వారా మార్చుకోవడం అనే వెసులుబాటు దుర్వినియోగమవుతోందని కేంద్ర మానవ వనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పలువురు అభ్యర్థులు పోటీ పరీక్షల్లో వయసును తక్కువగా  చూపించడం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఇక మీదట నిబంధనలను కఠినతరం చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. కోర్టు ఆదేశాలతో పాటు, అభ్యర్థి ఫలితాలు వెలువడడానికి ముందే కావలసిన మార్పులను ప్రభుత్వ గెజిట్ లో ప్రకటించాలి.  ఆ తరువాతే మార్పులకు అంగీకరిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ