టూమచ్: గుడి ఓకేగానీ మరీ భరతమాత ఫ్లెక్సీలోనా !!

February 05, 2015 | 03:31 PM | 35 Views
ప్రింట్ కామెంట్

తమిళనాట నటి కుష్బుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నటిగా ఓ ఊపు ఊపిన టైంలో ఆమెకు పిచ్చిపిచ్చిగా ఫ్యాన్స్ ఉండేవారు. ఎంతలా అంటే ఏకంగా ఆమెకు గుడి కట్టి పాలాభిషేకం చేసేశారు. ఆ తర్వాత ఆమె నటనకు దూరమయ్యే కొద్ది ఆ ఫాలోయింగ్ కాస్త తగ్గింది. అయినప్పటికీ ఆమె అంటే ఇప్పటికీ అక్కడి జనాలకు పిచ్చే. ఇక తాజాగా ఈ మధ్య ఆమె రాజకీయాల మీద ఆసక్తితో కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు. అయితే ఆమె క్రేజ్ ను వాడుకోవాలనుకుందేమో ఏమో కాంగ్రెస్ పార్టీ నేతలు మధురైలోని ఓ బస్టాండ్ వద్ద ఆమె ముఖంతో ఉన్న భరతమాత ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. దీనిని గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్కడ పెట్టారట. అయితే ఫ్లెక్సీ పెద్దది కావటంతో మొదట్లో ఈ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదట. కానీ పరిశీలించగా పరిశీలించగా అది కుష్బుదని తెలిసింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి బీజేపీ నేతల చెవిన పడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకొచ్చిన తంటా అనుకున్నారేమో అంతే స్పీడుగా స్పందించి దానిని తొలగించి కేసు నమోదు చేశారు మధురై పోలీసులు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ