అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ లభించింది. భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న దావూద్ పాకిస్థాన్ లోని కరాచీ నగర శివారు ప్రాంతం క్లిఫ్టన్ నుంచి ఫోన్లో మాట్లాడినప్పటి సంభాషణలను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేసింది. ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్ లో ఉంటున్న ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సమయంలో సంభాషణల్ని రికార్డు చేశారు. రెండు దశాబ్దాల క్రితం దావూద్ పాకిస్థాన్ పారిపోయిన తర్వాత భారత నిఘా సంస్థలు అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో భారత్ కు దావూద్ ను అంతం చేసే అవకాశం వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. భారత్ కమెండోలు దావూద్ ను టార్గెట్ చేసినపుడు, కొన్ని క్షణాలు ముందు భారత్ కు చెందిన ఓ రాజకీయ నేత ఫోన్ చేసి కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.