భారత్ కు ఒబామా రాక సందర్భంగా చరిత్రలో ఎన్నడూ లేనంత భద్రతా ఏర్పాట్లు చేస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. నిర్ణయ ఉదంతరం తరువాత దేశ రాజధానిలో మహిళల భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు కోర్టుకు ఇచ్చేందుకు అమికస్ క్యూరీగా మీరా భాటియాను నియమించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఒబామా భ్రదతకు 15 వేల సీసీ టీవీలను ఏర్పాటుచేయడాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఓ నివేదికను హైకోర్టుకు అందజేసింది. దీనిపై జస్టిస్ బదార్ దరేజ్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్ దేవాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. అంత భద్రత ఆయనకు అవసరమా? అని అడిగింది. ఒక విదేశీ నేత కోసం ఆర్భాటం చేస్తున్న మీరు... అదే దేశంలోని పౌరుల కోసం ఇంతగా స్పందిస్తారా అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ఢిల్లీ పోలీసులను కడిగిపారేసింది.