దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ చోరీ జరిగింది. ఓ బ్యాంకు సెక్యూరిటీ గార్డు సదరు బ్యాంకు నుంచి రూ. 2కోట్లతో పరారయ్యాడు. ఏటీఎం లలో డబ్బు పెట్టేందుకు బయలుదేరిన వ్యాన్ వెంటనే భద్రతగా వెళ్లిన సదరు సెక్యూరిటీ గార్డు సినీపక్కీలో డబ్బును దోచుకుని ఉడాయించాడు. పక్కాగా రచించుకున్న పథకం మేరకు నేటి ఉదయం ఏటీఎంలలో డబ్బు పెట్టేందుకు వెళ్లిన వ్యాన్ వెంట సదరు నిందితుడు కూడా వెళ్లాడు. అయితే తోటి సిబ్బందికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చాడు. టీ తాగిన మిగతా గార్డులు, వ్యాన్ డ్రైవర్, బ్యాంక్ అధికారులు మత్తులోకి జారుకోగానే నిందితుడు వెంటనే డబ్బుతో ఉడాయించాడు. సమాచారం అందుకున్న బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకునేందుకు నగర పోలీసులు రంగంలోకి దిగారు.