ఏమిసేతురా లింగా!

September 10, 2015 | 05:01 PM | 6 Views
ప్రింట్ కామెంట్
devottes-Lingam-Swami-blessing-private-parts-niharonline.jpg

ఈ కర్మభూమిలో భక్తిపారవశ్యం ఆవహించి, స్ఫృహ, మతి భ్రమించి భక్తుల ముద్ర ధరించి, నమ్మకం మత్తుతో వేసే వేషాలకు అంతు లేకుండా పోతుంది. గమనిస్తే భరతమాతకేం జరగబోతుందోనని భయమేస్తోంది. ఇంతవరకు భక్తజనకోటి యొక్క అమాయకత్వానికి పార్వ్శం ఇది. వీరందరి బలహీనత ఆధారంగా పుట్టుకొచ్చే స్వాములోర్లు, వారి లీలా విలాసాలు జనానిక క్షుణ్ణంగా  అర్థమైనా సరే, పదే పదే వారి మాయలో పడటానికి సిద్ధంగా ఉండే జనాన్ని చూస్తే ఏమనాలో లింగా?

ఫలానా పవిత్రప్రదేశంలో ఒకానొక స్వామిజీ అవతరించి భక్తి శిఖామణులను పునీతం చేసి కోరికలని తీర్చడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ సందర్భంలో స్వామివారి ప్రత్యేకత తెలుసుకుని తరిద్దాం. పాద నమస్కారాలు, సాష్టాంగ దండ ప్రమాణాలు, తీర్థ ప్రసాదాలు వంటి వృథా ప్రయాస లేదు. ఈ మహానుభావుడి పేరే లింగం స్వామి. సార్థక నామధేయుడైన ఈ బుధజన విధేయుడు భక్తులనాహ్వానించి, మీ కొరికలేవైనా సరే తీరగలవు ముఖ్యంగా సంతాన ప్రాప్తిరస్తు అనే శక్తివంతమైన మంత్రం తన చిన లింగ స్వామికి గలదు. ఏ సంశయం లేకుండా, స్త్రీ, పురుష బేధం పాటించకుండా తనకున్న జూనియర్ లింగ మహరాజుని స్పృశించి నంతమాత్రానా వారి జన్మ ధన్యమనే హామీ ఇవ్వబడుతోంది. భక్తుల తాకిడి వలన కాలగమనంలో లింగస్వామికి గల ఏకైక ఆస్తి అరిగిపోతే? పోతే గానీ ఈ మూఢుల కళ్లు తెరవుగదా లింగులిటిక్కు! లింగుపుటుక్కు!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ