సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే యువతులపై సహచరుల వేధింపులు రాను రాను ఎక్కువైపోతున్నాయి. తాజాగా దుబాయ్ కి చెందిన టెక్కీ యువతికి హైదరాబాదులో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒకప్పటి తన సహచరుడు స్నేహాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై లైంగిక వేధింపులు పాల్పడటమే కాదు... పెళ్లి చేసుకోవాలని హింసించాడు కూడా. వివరాళ్లోకి వెళ్లితే... దుబాయ్ కి చెందిన ఓ యువతి(23)ని హైదరాబాద్ లోని ప్రముఖ డెల్ కంపెనీలో పనిచేసింది. ఈ క్రమంలోనే సహ ఉద్యోగుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన సయ్యద్ ఇమామ్ తో స్నేహం ఏర్పడింది. అనంతరం ఉద్యోగం మానేసి తిరిగి ఆ యువతి దుబాయ్ వెళ్లిపోయింది. అయితే ఆమెతో పరిచయాన్ని అలుసుగా తీసుకున్న యువకుడు దుబాయ్ వెళ్లి మరీ ఆమెను మభ్యపెట్టాడు. మాయమాటలు చెప్పి ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చాడు.
అప్పటికే టోలీచౌకీలో అద్దెకు తీసుకున్న ఓ ఇంట్లో ఆమెను బంధీ చేశాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తూ ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయింది. అయితే, చివరకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని ఆమె సోదరుడికి తెలియజేసింది. వెంటనే అతను హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన షీటీమ్ ఇమాద్ ను అదుపులోకి తీసుకుంది. బాధితురాలి శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. అయితే లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది వైద్యపరీక్షల అనంతరమే నిర్ధారించుకుంటామని పోలీసులు తెలిపారు.