కైరోలో భారత కళాఖండాల ప్రదర్శన

March 03, 2015 | 04:24 PM | 43 Views
ప్రింట్ కామెంట్
egypt_khyro_exibition_niharonline

భారతీయ కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందనేది జగమెరిగిన సత్యం. అయితే ఈజిప్టులో భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు పేరెన్నికగన్న పలు చిత్రాలను, కళాఖండాలను మంగళవారం ప్రదర్శనకు పెట్టారు. ఈ ప్రదర్శనలో భారతదేశంపై చిత్రీకరించిన 'ఇండియా స్పిరిట్' అనే ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదరిశంచారట. ఇవి భారతీయులు రూపొందించినవి కావట. వీటిని అక్కడి విద్యార్థులు స్వయంగా తయారు చేసినవంటున్నారు. ఈ విషయాన్ని ఈజిప్టులోని భారత రాయబారి నవదీప్ సూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. కైరోకు 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న మాన్సురానగరంలో వీటిని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఒక రోజుమొత్తం ఈ ప్రదర్శన ఉంటుందనీ, ఈ ప్రదర్శనను తానూ వీక్షిస్తున్నట్టు తెలిపారు. గ్లింప్సెస్ ఇండియా అన్న పేరుతో భారతీయ కళలపై అక్కడి మన రాయబార కార్యాలయం వారు పోటీ నిర్వహించినట్టు, అందులో పాల్గొన్న ఈజిప్టు పిల్లలు చిత్రించిన కళాఖండాలను ఈ ప్రదన్శనలో పెట్టారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ