ఢిల్లీలో దారుణంగా అత్యచారం చేసి హింసించించిన నిర్భయ కేసు ఎప్పటికీ మరచిపోలేనిదిగా మిగిలిపోయింది. ఈ సంఘటన యావత్ భారత దేశాన్నీ కుదిపేసింది. ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి అత్యచారాలు జరగకుండా ఒక చట్టం చేయాలని తీర్మానించారు. దీని ఫలితంగానే వచ్చింది ‘నిర్భయ’ చట్టం. నిందితులకు శిక్ష కూడా పడింది. కానీ ఇప్పుడు నిర్భయ కేసు నిందితుడు ముఖేష్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు అమ్మాయిలు అర్థరాత్రి పూట ఎందుకు తిరగాలి? ఇంట్లో వాళ్ళకు ఏం చెప్పి బయట పడుతున్నారు? అర్థరాత్రి అయినా మగాళ్లతో ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశ్నిస్తున్నాడు. ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో నిర్లజ్జగా, పశ్చాత్తాపం లేకుండా మాట్లాడాడు. అత్యాచార విషయాల్లో మగాళ్లనే తప్పు పడతారు. ఆడవాళ్లకు కూడా అందులో భాగం ఉంటుందనే విషయం అందరూ గ్రహించాలన్నాడు. కేవలం ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని అంటున్నాడు. అబ్బాయిలు, అమ్మాయిలు పబ్బులు, డిస్కోలకు విచ్చల విడిగా తిరిగితే తప్పులేదా? అర్థ నగ్నంగా డ్రెస్సులు వేసుకుంటే మగాళ్ళు చూస్తూ ఊరుకోగలరా? అని ప్రశిస్తున్నాడు. అబ్బాయిలు, అమ్మాయిలు సమానమైనప్పుడు ఉరిశిక్ష ఎందుకంటున్నాడు. నిర్భయను తామేమీ అనలేదనీ, ఆమె స్నేహితుడ్ని మాత్రం చితకబాదామని అన్నాడు. నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు తాను డ్రైవ్ చేస్తున్నట్టు చెప్పాడు.