కొత్త సంవత్సరంలో వడ్డన షురూ

December 31, 2014 | 10:42 AM | 31 Views
ప్రింట్ కామెంట్

దేశ ప్రజలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే మోదీ ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి వాహన, వినియోగ వస్తు రంగాలకు ఇస్తున్న ఎక్సైజ్ సుంకం రాయితీలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇదే జరిగితే ద్విచక్ర వాహనాలు, టీవీలు, ఎసీలు తదితరాల ధరలు పెరగనున్నాయి. గడిచిన జూన్ లో మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత ఎక్సైజ్ సుంకాలలో రాయితీలను డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ రాయితీలను మరోసారి పొడగించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం. దీంతో పలు వస్తువులు, వాహనాల ధరలు 3 నుంచి 6 శాతం పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ