మహారాష్ట్ర ప్రభుత్వం గోవధను నిషేధించింది. ఎక్కడైనా గోవును చంపినట్టుగానీ, ఆవును కలిగి ఉన్నట్టుగానీ తెలిస్తే వారికి ఐదేళ్ళు జైలుశిక్ష విధించి, పదివేల రూపాయలు జరిమానా విధిస్తుంది. ఈ చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆమోదాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన నిర్ణయం ఇరవై ఏళ్ళుగా పెండింగ్ పడుతూ వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటి వార్ తెలిపారు. బీజేపీ, శివసేన ప్రభుత్వం మొదటి సారిగా 1995 లో మహారాష్ట్ర లో ఈ జంతు సంరక్షణ బిల్లును ఆమోదించింది. అది ఇన్నాళ్ళ తరువాత అమలులోకి వచ్చింది. ఈ నూతన చట్టం ఇకమీద అవును అమ్మినా, కలిగి ఉన్నా కూడా ఐదేళ్ల వరకు జైలుశిక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. కిరీట్ సోమయ్య నేతృత్వంలోని ఏడుగురు బీజేపీ ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆయన ఈ బిల్లునుఆమోదించారు. ఈ చట్టంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేశారు.