అమెరికా, అగ్రరాజ్యం అంటూ చదువుల కోసం, ఉద్యోగాల కోసం అడుగుపెట్టిన యువత జీవితాల వెనుక చీకటి కోణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. సులువుగా డబ్బు వచ్చే మార్గాలను ఎంచుకుని తప్పటడుగులు వేస్తున్నాయి. డాలర్ల మోజులో పోర్న్ చిత్రాలవైపు అడుగులు వేస్తున్నాయి. దిగ్బ్రాంతి కలిగించే అంశాలను పరిశీలిస్తే కొన్ని ఉదాహరణలు.
హైదరాబాద్ కి చెందిన 23 ఏళ్ల యువతి ఇక్కడ బీ-ఫార్మసీ పూర్తి చేసింది. పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడికి వెళ్లాక మనదేశానికే చెందిన కొందరు విద్యార్థులతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లోఉంది. మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆ విధ్యార్థిని జీవితంలో అనుకోని మలుపు. తన తోటి విద్యార్థుల లగ్జరీ లైఫ్ ఆమెను ఆకర్షించింది. అసలు అంత డబ్బు వారికి ఎలా వచ్చిందా అని ఆరా తీసింది. తీరా అసలు విషయం తెలిసి నోరు వెళ్లబెట్టింది.
వారంతా పోర్న్ సినిమాల్లో నటించి సొమ్ము చేసుకుంటున్నారని. విదేశాల్లో ఇండియన్ యువతుల నీలిచిత్రాలకు బాగా గిరాకీ ఉంటుందని వారు ఆమెకు హితబోధ చేశారు. సుఖంతోపాటు సొమ్ము చేసుకోవచ్చు అనుకుంది. అంతే తాను కూడా ఆ ఊబిలోకి దిగింది. కొద్ది రోజులకు ఆరోగ్యం క్షీణించటంతో ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక్కడ టెస్ట్ లు చేసిన డాక్టర్లు ఆమె పేరెంట్స్ కు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు చెప్పారు. దీంతో షాక్ తినటం తల్లిదండ్రుల వంతు అయ్యింది.
ఇలా ఒక్క అమెరికాలో, మన రాష్ట్రానికి చెందిన వారే కాదు... కోటి ఆశలతో విదేశాల్లోకి అడుగుపెట్టే ఇండియన్ యువతకు అక్కడి పాశ్చాత్య సంస్కృతి, ఈజీ మనీ కి అలవాటుపడటం, వ్యసనాలు అన్ని చెడుదారి పట్టిస్తున్నాయి. దాదాపు 3 శాతం యువతులు ఇలా నీలిచిత్రాల్లో నటించడం, వేశ్యవృత్తిలోకి దిగటం లాంటివి చేస్తున్నారంట. వెరసి జీవితాలను నాశనం చేసుకోవటం తప్పించి వారు సాధించేది ఏంలేదు. సో... పేరెంట్స్ ఇతర ప్రదేశాలకు పంపడం, వారికి స్వేచ్చను ఇవ్వటమే కాదు. ఆ స్వేచ్ఛను వారు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత మీకుంది. అదే టైంలో పెరేంట్స్ కు వాల్యూ ఇచ్చి ఇలాంటి అడ్డదారులు తొక్కకుండా ఉండాల్సిన బాధ్యత యువతదే.