ఆఫ్ఘన్ లో నలుగురు భారతీయులు హతం

May 14, 2015 | 12:55 PM | 28 Views
ప్రింట్ కామెంట్
afgan_Taliban_niharonline

తాలిబన్ ఉగ్రవాదులు బుధ వారం మరోసారి ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నగరంలోని ఓ గెస్ట్ హౌస్ లోకి దూరి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ  సంఘటనలో నలుగురు భారతీయులతో సహ ఒక అమెరికన్ కూడా మృతి చెంచారు. విదేశీయులు ఎక్కువగా ఉండే ఆ గెస్ట్ హౌస్ లో భారత రాయబారి ఉండవచ్చన్న అనుమానంతోనే ఈ కాల్పులు జరిపారని భావిస్తున్నారు. ఈ కాల్పులు కొన్ని గంటల పాటు కొనసాగిన అనంతరం  ఆ ఉగ్రవాదులను పోలీసులు కాల్చారు. ఇంతకు ముందు 2009 జులై లో కూడా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అప్పుడు ఆరుగురు భారతీయులు మృతి చెందారు. ఇప్పుడు అదే తరహాలో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో (ఆఫ్ఘన్ కాలమానం) ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. సమాచారం అందిన కొద్దిసేపటికే ఆఫ్ఘన్ జాతీయ భద్రతాదళం, ప్రత్యేక బలగాలు అక్కడకు చేరుకున్నాయి. తాలిబన్లపై కాల్పులు జరిపి, గెస్ట్ హౌస్ లో బందీలుగా ఉన్నవారిని విడిపించే ప్రయత్నం చేశారు. అయితే కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య మాత్రం స్పష్టంగా తెలియ లేదు. మొదట భారతీయులు ముగ్గురే అన్న వారు చివరికి నలుగురని తేల్చారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ