మరో కాంట్రవర్సరీ: ‘రామ భక్త ప్రభుత్వం’ అన్న గడ్కరీ

January 21, 2015 | 01:37 PM | 23 Views
ప్రింట్ కామెంట్

ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడుతుంటే. ఈసారి ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మతపరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం లేపారు. తమది రామ భక్త ప్రభుత్వం అని మాట్లాడి మరో వివాదానికి పునాది వేశారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఆయన మాట్లాడుతూ... అయోధ్య నుంచి చిత్రకూట పర్వతం వరకూ... జై శ్రీరాం అని స్మరించే రామభక్తులదే ఈ ప్రభుత్వం అన్నారు. ముస్లిం పాలకుల ఒత్తిడితో మతం మారిన వారిని తిరిగి హిందువులుగా మార్చేందుకు మాత్రమే ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన స్పష్టంచేశారు. కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది. ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఆరోపించింది. గతంలో కూడా ఇలా ఆయన చాలా వరకు ఇలా మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదస్పదమయిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ