నిత్యంలో పూజలతో, భక్తులకు ప్రవచనాలు బోధిస్తూ సన్మార్గంలో నడవాల్సిన ఓ వ్రుద్ధస్వామిజీ కక్కుర్తి పనులకు పోయి ప్రాణాలనే పొగొట్టుకున్నాడు. పూజలో నిమగ్నమై ఉన్న కొప్పళ మఠం శివానంద స్వామీజీ(80)ని ఓ భక్తురాలు కిరోసిన్ పోసుకుని అంటిచుకుని మరీ కౌగిలించుకోవడంతో ఇద్దరూ మృతి చెందారు. సోమవారం ఈ సంఘటన జరుగగా భక్తురాలు అదేరోజు మృతి చెందింది. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్న స్వామీజీ మంగళవారం మరణించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కర్ణాటకలోని యలబుర్గి తాలూకా మటికట్టి గ్రామంలో శివానంద అనే స్వామీజీ కొప్పళ మఠం నడిపిస్తున్నారు. ఈయనగారికి శరణమ్మ ప్రభావతి అనే ప్రధాన శిష్యురాలి ఉంది. అయితే వారిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మఠం ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలని కూడా ఆమె స్వామీజీని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే స్వామిజీ దీనికి అంగీకరించలేదట. దీంతో ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరీ పూజలో ఉన్న స్వామిజీని కౌగిలించుకుంది. ఆమె అక్కడిక్కడే చనిపోగా, తీవ్రగాయాలతో ఉన్న శివానందస్వామీజీని బాగలకోటెలోని శ్రీకుమారేశ్వర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం కన్నుమూశారు. భక్తిమార్గంలో కాకుండా ఇలా పక్కదారి పట్టిన స్వామిజీకి తగిన శాస్త్రే జరిగిందంటున్నారు జనాలు. ఇకనైనా ఇలా దొంగ బాబాలను నమ్మడం మానటం మంచిదంటున్నారు.