ఆఖరికి బళ్లారి బాబుకు బెయిల్

January 20, 2015 | 01:21 PM | 26 Views
ప్రింట్ కామెంట్

ఎట్టకేలకు ‘గాలి’కి స్వేచ్ఛ లభించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో జైలులో ఉన్న గాలి జనార్థన రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇఫ్పటికే ఆయనకు పలు కేసుల్లో బెయిల్ మంజూరు కాగా, మిగిలిన వాటిలో కూడా బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకుంది. మంగళవారం జరిగిన విచారణలో గాలి కి బెయిల్ మంజూరుచేస్తే ఏం అభ్యంతరం లేదని సీబీఐ తెలపడంతో కోర్టు బెయిల్ మంజూరుచేసింది. 30 లక్షల పూచీకత్తు చెల్లించాలని తెలిపింది. అలాగే ఆయన బళ్లారి విడిచివెళ్లరాదని, విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించింది. పాస్ పోర్టును కూడా అప్పగించాలని ఆదేశించింది. గాలి ప్రస్తుతం బెంగళూరు పరప్పరం అగ్రహారం జైలులో ఉన్నాడు. కోర్టు నుంచి ఆదేశాలు రాగానే విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, 2011 సెప్టెంబర్ 5న గాలిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ