కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమావేశం కావటం ఇప్పడు వివాదాస్పదమౌతోంది. అక్రమాస్తుల కేసులో శిక్షను ఎదుర్కొంటూ బెయిల్ పై బయట ఉన్న వ్యక్తిని ఇలా ఒక కేంద్రమంత్రే వెళ్లి కలవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతిపరురాలిగా చట్టం ద్రువీకరించిన ఓ వ్యక్తితో కేంద్ర ఆర్థికమంత్రికి ఏం పని ? వీరిద్దరు అసలు ఏయే అంశాలపై చర్చించారు? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె బెయిల్ పై ఓ ఖైదీయే అని వారంటున్నారు. మరీ దీనికి జైట్లీ ఇచ్చిన వివరణ ఏంటంటే... రాజ్యసభలో బీజేపీకి అన్నాడీఎంకే సహకారాన్ని కోరటానికేనని. రాజ్యసభలో ముఖ్యమైన బిల్లుల విషయంలో సరైన మెజార్టీ లేనందునా ఆటంకాలు ఏర్పడుతున్నాయని, అందుకే జయను కలిసి సపోర్టు కోరానని ఆయన వివరించాడు. ఇంతమాత్రం దానికి జయ అవినీతిలో బీజేపీ కి ఏదో వాటా ఉందన్న రేంజ్ లో ప్రతిపక్షాలు విరుచుపడుతున్నాయి. ఇది మరీ టూ మచ్ కదా.