కాదేదీ ఇంధనానికనర్హం!

May 21, 2015 | 04:54 PM | 29 Views
ప్రింట్ కామెంట్
american_bus_niharonline

ఒకప్పుడు గ్రామాలు పాడిపంటలు పశువులతో కళకళలాడేవి. పశువుల పేడను పిడకలు చేసి వంటకో, ఇల్లు అలకడానికో, పంటలకు ఎరువుగానో, లేదా వాకిట్లో కళాపి చల్లడానికో మాత్రమే ఉపయోగించుకునే వారు. ఆ తరువాత పేడ ద్వారా గ్యాస్ తయారు చేసి, దాన్నివంటింటి అవసరాలకు ఉపయోగించుకునే టెక్నాలజీని రూపొందించుకున్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా బస్సునే నడిపించేంత అభివృద్ధి సాధించాం. అమోరికా బెడ్ ఫోర్డ్స్ లోని మిల్ బ్రూక్స్ గ్రౌండ్సులో పేడను ఇంధనంగా ఉపయోగించి ఓ బస్సును గంటకు 123 కిలో మీటర్లు వేగంతో నడిపి కొత్త రికార్డును నెలకొల్పారు అక్కడి నిర్వాహకులు.  బస్సుకు పైకప్పులో ట్యాంకర్లను నిర్మించి అందులో పేడను వేశారు. ఆ పేడ వల్ల ఉత్పత్తి అయ్యే బయోమీథేన్ గ్యాస్ ఆధారంగా బస్సు నడుస్తుంది. ఐతే పేడ వాసన ప్రయాణికులకు రాకుండా తగు విధంగా ఏర్పాట్లు చేసి మెరుగ్గా బయటకు తీసుకొస్తామని అంటున్నారు. అయితే అది అమెరికా ప్రయోగమే అయినా రేపో మాపో మన దేశానికి రావచ్చు. వెయిట్ అండ్ సీ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ