అధిక ఆదాయం ఉన్న వారికి వంట గ్యాస్ సబ్సిడీ ని రద్దుచేయాలని కేంద్రం యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన యూపీఏ-2 హయాంలోనే వచ్చినప్పటికీ మోదీ వచ్చాక దీనిపై చర్యలు వేగవంతం అయ్యాయి. సంస్కరణల్లో భాగంగా డీజిల్ పై నియంత్రణ ఎత్తేసిన కేంద్రం, ఇప్పుడు 30 శాతం పన్ను శ్లాబ్ లో ఉన్నవారి సబ్సిడీని రద్దుచేయాలని ఆలోచిస్తుందట. రాబోయే బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ ధరకు సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ కావాలంటే మాత్రం మార్కెట్ రేటు చెల్లించాల్సిందే.