15 ఏళ్లకు నిఖా చేసుకోవచ్చట

December 08, 2014 | 10:33 AM | 33 Views
ప్రింట్ కామెంట్

ఓ ముస్లిం అమ్మాయికి 15 ఏళ్లు నిండితే చాలు ఆ అమ్మాయి వివాహం చేసుకోవచ్చని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. ఓ ముస్లిం యువకుడు తన కమ్యూనిటీకి చెందిన 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా బాల్య వివాహ నిషేధ చట్టం కింద ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలించిన జస్టిస్ జేబీ.పర్దివాలా ఆధ్వర్యంలోని ధర్మాసనం, పిటిషన్ పై జరుగుతున్న న్యాయ విచారణను కొట్టివేసి తీర్పు వెల్లడించింది. ముస్లిం చట్టం ప్రకారం, ఆ వర్గానికి చెందిన యువతి పదిహేనేళ్ల దాటితే చాలు వెంటనే పెళ్లి చేసుకోవచ్చునని తెలిపింది. "ఇక్కడ వివాదం వీరిద్దరు ఇస్లాం మతానికి చెందిన వారని కాదు. ముస్లిం సొంత చట్టం ప్రకారం అమ్మాయి యుక్త వయస్సు రావటం లేదా 15 ఏళ్లు నిండటం ఈ రెండింటిలో ఏది ముందు జరిగినా సరే వివాహం చేసేయోచ్చని పేర్కొంది. ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండా కూడా వివాహం చేసుకోవచ్చు అని ధర్మాసనం తెలిపింది. మరోవైపు కోర్టు విచారణ సమయంలో సదరు యువతి తల్లిదండ్రులు, పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి హాజరయ్యారు. పెళ్లి విషయాన్ని కోర్టుకు ధృవీకరించారు. అత్తవారింటో భర్తతో తాను సంతోషంగా ఉన్నానని యువతి కోర్టుకు తెలిపింది. అటు ఆమె తల్లిదండ్రులు కూడా వారి వివాహాన్ని న్యాయస్థానం ముందు అంగీకరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ