అభిమానానికి హద్దు పొద్దు ఉండబోదని తరుచు కొందరి చేష్టలు చూసి మనం అనుకుంటూ ఉంటాం. అంతేకాదు ఆ సమయంలో నవ్వుకుంటాం. కానీ, వారు అభిమానించేవారు ఆయా ఘటనలకు స్పందిస్తే... ఆ వీరాభిమానులు వారు పడినంత కష్టానంతా మరిచిపోయి హ్యాపీగా ఫీలవుతుంటారు. తాజాగా తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత అభిమాని ఒకరు శిలువ వేయించుకుని అమ్మపట్ల తనకున్న భక్తిని చాటుకున్నాడు. ‘ఆమె తిరిగి ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే మా కష్టాలు తీరతాయి’ అంటూ సిహాన్ హుసైనీ చేతుల్లో కాళ్లలో మేకులు దింపుకుని మరీ ఈ కార్యానికి దిగాడు. ఇతగాడు ఎవరో కాదు తమిళ చిత్రాలకు స్టంట్ డైరక్టర్. జయలలిత 67వ పుట్టినరోజు సందర్భంగా 6నిమిషాల 7 సెకన్లపాటు ఈ ఫీట్ ను చేశాడు. ఇక దీనిపై జయలలిత స్పందించింది. నాకు మద్దతుగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా కోసం చాలా బాధ అనుభవించావు. ఈ సంగతి తెలిసి దిగ్భ్రాంతికి లోనైయ్యాను. ఇంకెప్పూడూ శరీరానికి బాధకలిగించే ఇటువంటి చర్యలు చేయకు. నీ భావి జీవితం గురించి ఆలోచించు. గాయాలపాటు కావద్దు అంటూ ఆమె లేఖలో స్పందించారు.