చదివింది ఏడో తరగతే కానీ, అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాడు

February 23, 2015 | 05:35 PM | 60 Views
ప్రింట్ కామెంట్
abdul_razaq_madhurai_electrician_niharonline

అతనో ఎలక్ట్రీషియన్, చదివింది ఏడో తరగతే. కానీ, శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా అద్భుతాలు ఆవిష్కరించాడు. తమిళనాడులోని మధురైలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న అబ్దుల్ రజాక్ (45) అతి తక్కువ విద్యుత్ తో పనిచేసే పరికరాలను కనుగొన్నాడు. కేవలం 7 వ తరగతి దాకా చదివిన రజాక్ రైల్వే పట్టాలపై పగుళ్లను కనుగొనే పరికరం. ఒకే సమయంలో అన్నం, కూర తయారు చేసే కుక్కర్ సహా 37 రకాల పరికరాలను తయారుచేసి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రంపపు పొట్టుతో అగరుబత్తిలకు ఉపయోగించి జిగురును చేర్చి కంప్రెస్ యంత్రం ద్వారా అదిమి, చెక్కపొట్లు ఇందనపు కడ్డీని ఆయన తయారుచేశాడు. కేవలం రూ.3 రూపాయలతో తయారుచేసిన ఈ కడ్డీకి స్టవ్ బర్నర్ సెట్ ను జతచేసి గంటకు పైగా వంట చేసుకొవచ్చునని తెలిపారు. సీలింగ్ ఫ్యానులో టేబుల్ ఫ్యాన్ రెక్కలను అమర్చి డబుల్ డెక్కర్ ఫ్యాన్ ను తయారు చేశాడు. దీంతో విద్యుత్ ఖర్చు ఎక్కువయ్యే అవకాశం లేదంటున్నాడు. ఈ ఉత్పత్తుల పేటెంట్ లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఇతని గురించి గత కొన్నేళ్లుగా పలు జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం సాయం అందించకపోవటం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ