హర్యానాలో దారుణం... ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని పొట్టనబెట్టుకుంది. ఒక బిడ్డను చంపిన కేసులో జైలుకెళ్లి... అక్కడ తన మరో బిడ్డను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... రోహ్ తక్ జిల్లాకు చెందిన ఓ మహిళ సంవత్సరం క్రితం కుమార్తెను చంపిన కేసులో జైలుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె గర్భవతి. శిక్షకాలంలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. కానీ, మూడు రోజులు క్రితం ఆమె ఆ పసికందును కూడా మూడు రోజుల క్రితం చంపేసింది. ఈ హత్యలపై ఆమె నేడు కోర్టుకు హాజరుకానుంది. ఈ హత్యలు ఎందుకు చేసిందోనన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.