మారుతున్న జీవన శైలి వల్ల నేడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరుతుతోంది. అందులో భాగంగానే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మొదలు పెట్టారు. ఇందుకోసం మనకు మార్కెట్లో లభించే తెల్లని బియ్యం బదులు పాలిష్ పట్టని బియ్యాన్ని వాడటానికే ఇష్ట పడుతున్నారు. ఈ బియ్యం ఆరోగ్యానికి మంచివే కాని నిలువ ఉంటే తొందరగా పురుగు పట్టేస్తుంది. అందుకని రైతులు మిల్లుకు ఒకటి రెండు బస్తాల ధాన్యాన్ని మాత్రమే తీసుకు వెళ్ళి పట్టించాల్సి ఉంటుంది. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. రైతుకు ఈ శ్రమ తగ్గించడం కోసం మహారాష్ర్టలోని విఙ్ఞానాశ్రమం అనే సంస్థ రైస్ డీ-హస్కింగ్ యంత్రాన్ని రూపొందించింది. దీనివల్ల ఎవరైనా సరే ఇంటి వద్దే ముడి బియ్యాన్ని మర ఆడించుకోవచ్చు. ఈ యంత్రం ద్వారా గంటకు 10 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేయవచ్చు. కరెంట్ ఖర్చు కూడా తక్కువేనట. ధర 20 వేల రూపాయలవరకు ఉంటుంది. బాగుంది కదూ చిన్న రైస్ మిల్. వివరాలకు మహారాష్ర్టలోని విఙ్ఞానాశ్రమం అనే సంస్థను సంప్రదించవచ్చు.