చిల్లు గుండెకు కాదు... జేబుకు

May 20, 2015 | 04:45 PM | 24 Views
ప్రింట్ కామెంట్
heart_stent_niharonline

“ఆరోగ్యమే మహా భాగ్యం”. ఒకప్పటి మాట.  మారుతున్న నేటి పరిస్థితుల్లో వైద్యం అందితే చాలు అదే మహా భాగ్యం.  ఇప్పుడొచ్చే ఆరోగ్య సమస్యలన్నీ కూడా నిముషాల్లోనే ముంచుకొస్తున్నావే. క్షణాల్లో వైద్యం అందితేనే సరి. లేదా అంతే సంగతులు. దీనిని ఆసారాగా చేసుకునే  ఆసుపత్రులు రోగులను నిలువు దోపీడి చేస్తున్నాయి. ఇక హృద్రోగుల పరిస్థితి మరీ దారుణం.  వారికి అమర్చే స్టెంట్‑లను లాభసాటి వ్యాపారంగా మార్చేశారు కొంతమంది. పశ్చిమ దేశాల నుంచి భారత్‑కు దిగుమతి చేసుకునే ఒకో స్టెంట్ విలువ అక్షరాల 25 వేల రూపాయలు. కానీ రోగికి అమ్మే విలువ ఏకంగా 1.55 లక్షల వరకు ఉంటోంది. అంటే దిగుమతి రేటు కంటే దాదాపు 700 శాతం ఎక్కువ. ముంబై సహా మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఈ తంతు సాగుతోంది. స్టెంట్‑ల దిగమతి దారులు దాని ధరపై దాదాపు 120 శాతం లాభానికి డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు తాము కొనుగోలు చేసిన మొత్తం కంటే దాదాపు 120-125 శాతం అధిక ధరకు ఆస్పత్రులకు విక్రయిస్తున్నారు. ఇక ఆస్పత్రి యాజమాన్యాలు కనీసం 25 శాతం అధిక ధరను రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో దిగుమతిదారు నుంచి స్టెంట్‑ రోగికి వెళ్లే క్రమంలో క్రమేణా రేటు పెంచుతూ దోచుకుంటున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‑డీఏ) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వచ్చే హృద్రోగులు  తమకు భారమైనా గత్యంతరం లేని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు చేసి స్టెంట్‑లు కొనుగోలు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ