వంద సంవత్సరాల వర్షం ఒక్కరాత్రిలో పడితే!

December 02, 2015 | 10:18 AM | 2 Views
ప్రింట్ కామెంట్
hundred_years_rain_record_break_in_chennai_niharonline

అది 1918,,, తమిళనాడు రాజధాని చెన్నై(అప్పట్లో మద్రాస్)లో వర్షపాతం నమోదైంది. అది అలాంటి ఇలాంటి వర్షం కాదు. నగరాన్ని ముంచెత్తిన తన ప్రతాపంతో ముంచెత్తిన వరుణుడు ఏకంగా 108.8 సెంటీ మీటర్ల వర్షపాతాన్ని కుమ్మరించిపడేశాడు. నిన్నటిదాకా చెన్నై నగరంలో కురిసిన అత్యధిక వర్షపాతం అదే. వందేళ్ల తర్వాత ఆ రికార్డు బద్ధలయిపోయింది. బ్రిటీష్ వారు చొరవచూపించినప్పటికీ కొలుకోవటానికి దాదాపు 8 నెలలు పైగానే పట్టింది.

               ఇక తాజా విషయానికొస్తే... గత రెండు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి వరకే నగరంలో 119.73 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మంగళవారం కూడా ఎడతెరిపి లేని వర్షం చెన్నైని ముంచెత్తింది.

మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం రాత్రికే చెన్నైలో అత్యధిక వర్షపాతం రికార్డు బద్దలు కాగా, వరుణుడు శాంతించేలోగా సరికొత్త రికార్డులు నమోదు కానున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ రికార్డులు చెరిగిపోయే అవకాశాలే లేవన్న వాదన వినిపిస్తోంది. అదే టైంలో జనాలు బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం వెల్లదీస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ