బూతును వెతకటంలో భారతీయులే టాప్

October 08, 2015 | 12:27 PM | 2 Views
ప్రింట్ కామెంట్
indians-top-in-search-for-porn-sites-niharonline

సైబర్ సెక్యూరిటీ కఠినతరంగా ఉన్నవేళ భారత్ మాత్రం అందుకు విరుద్ధం అంటుంది. ఓవైపు సామాజిక సంఘాలు, ఎన్టీవోలు తమ బాధ్యతగా పోర్న్ బ్యాన్ చెయ్యాలని పట్టుపడుతుంటే... ఆశావాహులు మాత్రం అక్కర్లేదంటూ అభ్యంతరం పెడుతున్నారు. ఇక కోర్టులు సైతం వ్యక్తుల ప్రవేట్ జీవితంలోకి తొంగి చూడలేం సారీ అంటూ చేతులు ఎత్తేసింది. వీటన్నింటిని   పక్కన పెట్టి ఆఫీస్ వేళల్లో, ఇంట్లో, ఎక్కడ పడితే అక్కడా బూతు, అశ్లీల, అభ్యంతరకరమైన చిత్రాలను, వెబ్‌సైట్లను చూడటంలో మన దేశం టాప్ ప్లేస్ లో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. పని ప్రదేశాల్లో అవసరాల కోసం ప్రతి ఐదుగురిలో ముగ్గురు సోషల్ మీడియా వెబ్‌సైట్లను చూస్తే, మిగతా ఇద్దరు మాత్రం సెక్స్ సైట్లపైనే పడుతున్నారట. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే... పనివేళల్లో సైతం పెద్దలకు మాత్రమే వెబ్‌సైట్లను చూడటంలో ఇది అధికంగా ఉండటం.

గూగుల్ లో అత్యధిక మంది భారతీయులు కెలికేది అశ్లీలం కోసమేనట. నిషేధమున్నా, లేకున్నా బూతు సైట్ల కోసం వెతుకుతున్న భారతీయుల సంఖ్య రాను రాను పెరుగుతుందట.

                    గూగుల్ అందించిన గణాంకాల ప్రకారం 'పోర్న్' సైట్లను వెతుకుతూ, వాటిని తిలకించే వారు అధికంగా ఉన్న టాప్-10 నగరాల్లో ఆరు భారత నగరాలే ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు పూణె, ముంబై, హౌరా, బెంగళూరు ఈ జాబితాలో ఉండగా, యూపీలోని పరమ పవిత్ర పట్టణం ఉన్నావో 'చిన్నారుల అశ్లీలం'పై అధికంగా సెర్చ్ చేస్తున్న విషయం మరీ దారుణ:. 2008 నుంచి ఈ డేటాను కంపైల్ చేయగా, పూణె నగరం నుంచి 'యానిమల్ సెక్స్'పై అధికంగా సెర్చ్ వచ్చిందని, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల వాసులు 'రేప్ పోర్న్' అనే పదాన్ని అధికంగా వెతికారని గూగుల్ వెల్లడించింది. కాగా, ఈ గణాంకాలు పూర్తి వాస్తవం కాకపోవచ్చని, ఇండియాలో క్రిప్టోగ్రఫీ సరిగ్గా అమలు కాకపోవడం వల్ల మిగతా ప్రపంచ నగరాల వివరాలు నమోదు కాలేదని సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ నిపుణుడు అజిత్ హత్తీ వ్యాఖ్యానించారు. బ్యాన్ పెట్టే చాన్స్ ఎలాగూ లేకపోవటంతో నెటిజన్లలో ఈ సంఖ్య రాను రాను మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ