ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ, ముంబై, జైపూర్ సహా పలు నగరాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఐపీఎల్ 8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో బెట్టింగ్ లో ప్రమేయమున్న అనూప్ మహాజన్ అనే బుకీని పఠాన్ కోట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 3.3 లక్షల నగదు, మొబైల్స్, ఎల్ సీడీ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ కేసులో పోలీసులు మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు.