బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలనుకుని కలలు కన్న ఓ యువతికి(22) ఓ మాయగాడు గాలం వేశాడు. సినిమా ఛాన్స్ ల పేరుతో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాజస్థాన్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఏకంగా సల్మాన్ ఖాన్ సరసనే హీరోయిన్ చాన్సు ఇప్పిస్తానని చెప్పిన ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి సదరు యువతిపై అత్యాచారం చేశాడు. జైపూర్ లోని ఓ హోటల్ లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆ నగల వ్యాపారి ఆ వీడియోన్ని వాట్సఫ్ లో సదరు బాధితురాలికి పంపాడట. అంతేకాదు ఆ వీడియోను నెట్ లో పెడతానని బెదిరిస్తూ తన స్నేహితులు కొందరి కోరికలు తీర్చాలని డిమాండ్ చేశాడట. యువతి ధైర్యం చేసి ఈ ఘటనపై జైపూర్ లోని శ్యాంనగర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పడేశారు.