కలాం అంతిమయాత్రతో రామేశ్వరం జనసంద్రం

July 30, 2015 | 11:43 AM | 5 Views
ప్రింట్ కామెంట్
Kalam_last_rites_in_rameswaram_niharonline

భారత అణ్వాయుధ పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంతిమయాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. కడసారి ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు కదలి రావటంతో  రామేశ్వరం జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంతా పరిస్థితి అక్కడ నెలకొంది. జనమంతా కలాంకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. బుధవారం సాయంత్రం ఆయన పార్ధివ దేహం ప్రత్యేక విమానంలో తమిళనాడులోని ఆయన స్వస్థలం రామేశ్వరం చేరుకుంది. అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్ లో ఆయన మృతదేహాన్ని రామేశ్వరంకు తరలించారు. తమ ప్రియతమ వ్యక్తికి కన్నీటి నివాళులు అర్పించేందుకు అధిక సంఖ్యలో జనం రామేశ్వరం తరలివచ్చింది. తండోపతండాలుగా తరలివచ్చిన జనసందోహం నిరీక్షణ నడుమ మరికాసేపట్లో రామేశ్వరం రైల్వేస్టేషన్‌ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు జరుగనున్నన్నాయి. కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ కేంద్రమంత్రులు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, రాహుల్ గాంధీతో పలువురు కాంగ్రెస్ నేతలు  హాజరుకానున్నారు. పార్థివదేహం వెంట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌లు చేరుకున్నారు. మంత్రివర్గ సహచరుడు పొన్ రాధాకృష్ణన్ వారితో చేరారు. కలాం పార్థివ దేహంపై మూడురంగుల జెండాను కప్పి రోడ్డు మార్గం గుండా సైనిక వాహనం లో వెళు తుండగా రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు దీరారు. దాదాపు 10కిలోమీటర్ల పొడవునా ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ