గురువు అనే వ్యక్తి ఏ విద్యార్ధి అయిన పరీక్షలు బాగా రాయాలనే కోరుకుంటాడు. విద్యార్థుల ప్రదర్శన, పాటవాలను ఆయా పరీక్షల్లో చూసి మురిసిపోతుంటారు. కానీ, ఇక్కడో విద్యార్థి చదువు చెప్పే గురువుకే షాకిచ్చేలా ఓ పనిచేశాడు. తనను పాస్ చేయాలని బెదిరిస్తూ ఆ విద్యార్ధి సమాధాన పత్రంలోనే ఓ లేఖ రాశాడు. సరిగ్గా రాయలేదు సరికదా, పరీక్షల్లో తనను ఫెయిల్ చేస్తే టీచర్ తోపాటు ఆయన ఇంట్లో వారందరినీ మంత్రాలతో చంపేస్తానని లేఖలో బెదిరించాడు. ఇక ఆ విద్యార్థి రాసిన లేఖ వ్యవహారం కర్ణాటక విద్యాధికారులకు చేరింది. కాగా, విద్యార్థి హరిహర ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తోంది. కానీ, మరిన్ని వివరాలు చెప్పేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు. అంతేకాదు, ఓ వైపు బెదిరిస్తూనే మరోవైపు సమాధాన పత్రం చూడకుండా పాస్ చేయాలని, లేదంటే ఆత్మహాత్య చేసుకుంటానని కూడా మరో లెటర్ రాశాడట.