కోర్టు చెప్పినా కేరళ సర్కార్ వినదంట

February 06, 2016 | 12:57 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kerala-suprame-court-No-entry-for-women-into-Sabarimala-niharonline

మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఆలయం శని సింగనాపూర్ లోకి మహిళల ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ, కేరళ సర్కారు తన పాత వాదననే పునరుద్ఘాటించింది. ప్రముఖ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతించలేమని ఉమెన్ చాందీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి శుక్రవారం తేల్చిచెప్పింది. వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న మహిళల నిషేధాన్ని రద్దు చేసి సంప్రదాయానికి పాతర వేయలేమని కుండబద్దలు కొట్టింది.

                     10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. శబరిమలలోకి మహిళ ప్రవేశానికి అనుమతించాలని 2007లో దాఖలైన పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ఉమెన్ చాందీ ప్రభుత్వం సంప్రదాయానికే పెద్ద పీట వేయనున్నట్లు కోర్టుకు తేల్చిచెప్పింది. మరి ఈ విషయంలో సుప్రీం తుదితీర్పు ఎలా ఉండబోతుందనేది కాస్త సమయం పట్టోచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ