ఓడిపోతే పాఠాలు చెప్పుకుంటూ బతుకుతుందట

January 31, 2015 | 02:21 PM | 41 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గనుక ఓడిపోతే బోధన రంగం వైపు వెళ్తారట బీజేపీ సీఎం అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ. ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో ఇఫ్పటికే నాకు చాలా బోధన ఒప్పందాలున్నాయి. అవన్నీ ప్రస్తుతం ఆగిపోయాయి. ఒకవేళ ఓడిపోతే మాత్రం వాటి వైపు వెళ్లిపోతా అని ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బీజేపీ సభ్యురాలిగా ఉంటూనే మరోవైపు తరగతులు చెబుతానని ఆమె తెలిపారు. అంతేకాదు నవ్ జ్యోతి, ఇండియన్ విజన్ ఫౌండేషన్ ట్రస్టుకు కూడా వెళతాను అని ఆమె పేర్కొన్నారు. ఎలాగైనా గెలవాలన్న కసి తనలో చాలా ఉందని ఆమె చెబుతున్నారు. గతంలో ఆమె ఐపీఎస్ ట్రైనీలకు తరగతులు బోధించటంతోపాటు పలు యూనివర్సిటీలలో గెస్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ