ఆ మ్యాటర్లో కోహ్లీ మాస్టర్ ని మించిపోయాడే

December 24, 2014 | 03:20 PM | 25 Views
ప్రింట్ కామెంట్

సచిన్ టెండూల్కర్ రికార్డుల కోసమే పుట్టిన క్రికెట్ దేవుడు. అలాంటి మాస్టర్ రికార్డునోకదాన్ని టీం ఇండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్ధలు కొట్టేశాడు. అదేంటీ కెరీర్ కొచ్చిన ఇంత త్వరగానే కోహ్లీ, సచిన్ ఏ రికార్డు బద్ధలు కోట్టాడా అన్న సందేహం మీకు కలగక మానదు. అది ట్విట్టర్ ఫాలోయింగ్ లో లేండీ. భారత్ లో క్రీడాకారుల జాబితాకు సంబంధించి ట్విట్టర్ లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు స్రుష్టించాడు. ప్రస్తుతం 48,70,190 మంది కోహ్లీ ని ఫాలో అవుతుండగా, 48,69,849 మంది ఫాలోవర్స్ తో మాస్టర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా సెలబ్రిటీగా కూడా కోహ్లీ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ట్విట్టర్ లోనే... త్వరలో అయితే ఏకంగా పరుగుల పరంగా కూడా సచిన్ రికార్డును బద్ధలు కొడతాడని కోహ్లీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. పరుగుల రికార్డు ఏమో కాని... ఎంతైనా కుర్రాడు కదా... ఆటోమేటిక్ గా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది లే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ