కొల్లేరు ప్రాంతంలోని ప్రజలకు న్యాయం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలన్న తీర్మానం మీద మంగళవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన-కొల్లేరు కాంటూరు కుదింపు పై సాధికార కమిటీ ఉందని చెప్పారు. అవసరమైతే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. నాడు బాంబులు, పోక్లైన్లతో చెరువులు ధ్వంసం చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని, తాము నిలదీసిన తరువాత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ తాజా తీర్మానం రాజకీయ ప్రయోజనాలకోసమేనన్న ప్రతిపక్షనేత జగన్ ఆరోపణను ఆయన ఖండిరచారు. అబద్ధాలు చెప్పవచ్చు..కానీ చరిత్రను తిరగ రాయలేరు అని ఆయన వ్యాఖ్యానించారు. అటు-తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబుకు అప్పుడు కొల్లేరు సమస్య గుర్తుకు రాలేదా అని జగన్ ప్రశ్నించారు. ఆయన కట్టు కథలు చెప్పిస్తున్నారని జగన్ అన్నారు. కాగా-ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిరది. ఈనెల 18 న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు ఐదు రోజులు కొనసాగాయి.