బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు ప్రత్యేక కోర్టు నోటీసులు జారీచేసింది. ఈయనతోపాటు బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తా, జార్ఖండ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఏకే బసుకు కూడా సమన్లు జారీచేసింది. వారితోపాటు మరో ఐదుగురికి కూడా నోటీసులు పంపింది. ఫిబ్రవరి 18న మొత్తం ఎనిమిది మంది తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి విచారణ చేపట్టిన కోర్టు పైవిధంగా సమన్లు జారీచేసింది.