భారత్ లో వాట్సాప్ బ్యాన్ పక్కా!

May 07, 2016 | 11:29 AM | 1 Views
ప్రింట్ కామెంట్
whatsapp-ban-in-india-niharonline

ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. భారత్ లో ఇప్పుడున్న యువత పరిస్థితి ఎలా ఉందటంటే... పొద్దున ఫేస్ కడుక్కోకుండానే ఫేస్‌బుక్,  అలాగే వాటర్ తాగకుండా వాట్సప్ లో ఉంటున్నారని. అది అక్షరాల నిజమని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆకలి, నిద్ర, లేకపోయినా ఫర్వాలేదు కానీ స్మార్ట్ ఫోన్ అందులో ఆయా సోషల్ మీడియా అప్ డేట్స్ లేకపోతే మాత్రం ఆరోజంతా ఏం తోచదు అన్న చందగా మారిపోయింది. అదే టైంలో టెలికాం దిగ్గజాలకు ఆయా యాప్ లు పెద్ద తలనొప్పులుగా మారాయి.

యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఉచిత కాల్స్, మేస్సేజీలను ఆఫర్ చేస్తుండడంతో మండిపడుతున్నాయి. ఇక దిగ్గజ టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలు ఓ అడుగు ముందుకు వేసి ఇలాంటి యాప్స్ ను నిషేధించాలని కోరుతున్నాయి. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా టెలికామ్ శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ కు లేఖ రాసింది. మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ కాల్స్ ను అనుమతించడం నిబంధనలకు వ్యతిరేకమని లేఖలో ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి.

                            అదే టైంలో వాట్సాప్ యాప్ ను ఖచ్ఛితంగా ఇండియాలో నిషేధించాల్సిన అవసరం ఉందని పట్టుబడుతున్నాయి, అవసరమైతే కోర్టు గడపను తొక్కుతామని అవి ప్రకటించాయి. మరోవైపు  వాట్సాప్ వల్ల అసాంఘిక కార్యకలపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయంటూ సుప్రీంలో ఈ మధ్య ఓ పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు కూడా జారి చేసింది. అయితే ప్రస్తుతానికైతే నిషేధం పై ఎలాంటి సంకేతాలు అందకపోయినప్పటికీ, ఇప్పటికే పలు దేశాలు వాట్సాప్ ను బ్యాన్ చేసిన నేపథ్యంలో మన దేశంలో కూడా అది జరిగే పరిస్థితి లేకపోలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ