చిరుతకు చుక్కలు చూపిన చిన్ని కుక్క!

June 26, 2015 | 05:54 PM | 9 Views
ప్రింట్ కామెంట్
leopard_chased_by_Dog_mumbai_niharonline

దేశంలో గత 24 గంటల్లో రెండు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనలు భాదిత జీవి చిరుతపులే కావటం విశేషం. అందులో ఒకదాంట్లో ఓ చిన్ని కుక్క పిల్ల చిరుతకే చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్లితే... అది ముంబై శివారులోని ఓ అపార్ట్ మెంట్. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీయదు గానీ ఓ చిరుత పులి అక్కడికి వచ్చింది. బాగా ఆకలితో ఉన్న ఆ చిరుత కన్ను అక్కడే ఉన్న ఓ చిన్న కుక్కపిల్లపై పడింది. అంతే దానిపై దూకి ఆరగించాలనుకుంది. కానీ, అక్కడ ఇనుపచువ్వల గ్రిల్ అడ్డురావటంతో అటు ఇటు తిరుగుతూ గాడ్రించింది. ఇంతలో మెలకువ వచ్చిన కుక్క పిల్ల తన విశ్వరూపాన్ని చూపింది. భయం లేకుండా చిరుత చెవ్వులు చిల్లులు పడేలా అరిచింది. ఆ అరుపులకు భయపడిన చిరుత తొకముడిచి పారిపోయింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. తనిఖీల్లో భాగంగా ఆ వీడియో చూసిన ఆ ఇంటి యజమాని హడలిపోయాడట.  ఆ వీడియోను ప్రస్తుతం యూట్యూబ్ లో అప్ లోడ్  చేయగా ప్రస్తుతం దానికి విపరీతమైన లైక్ లు వస్తున్నాయి.

                              ఇక మరో ఘటనలో ఓ రైతు కొడవలి చేతబట్టి చిరుతతో పోరాడాడు.  ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందిన ఓ రైతు పోలంలో పనిచేసుకుంటుండగా, ఓ చిరుత ఆయనపై హఠాత్తుగా దాడిచేసింది. అయితే వెంటనే తేరుకున్న ఆ రైతు తన చేతిలో ఉన్న కొడవలినే ఆయుధంగా చేసుకుని ఆ చిరుతతో పోరాడాడు. చివరికి గాయాలపాలైన ఆ చిరుత బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి పరుగులు పెట్టింది. స్వల్ఫంగా గాయపడిన నరసింహాన్ని స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ