రాసలీలలతో వివాదస్పద స్వామిగా ముద్రపడిన నిత్యానంద కొత్తగా రచయిత అవతారం ఎత్తారు. ఏకంగా ఒకేసారి 28 భాషల్లో పుస్తకాలు ఎడాపెడా రాసేసి భక్త జనం మీదకు వదిలారు. పనిలో పనిగా ఆడియో సీడి, విడియో డివీడీలను కూడా సిద్ధం చేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ బుక్ ఫెయిర్ లో ప్రస్తుతం ఈ పుస్తకాలు, సీడీలు దర్శనిమిస్తున్నాయి. మొత్తం 30 దేశాలకు సంబంధించిన ఆధ్యాత్మిక రచనలు ఇక్కడ అమ్ముతున్నారు. నిత్యానంద రాసిన పుస్తకాలు ప్రధానంగా ఆంగ్లం, హిందీ, స్పానిష్, జర్మన్, ప్రెంచ్, చైనా భాషల్లో అధికంగా ఉన్నాయి. వీటిలో భక్తి ప్రవచనలు మాత్రమే ఉంటాయని ఆయన అనుచరులు నొక్కి చెబుతున్నారు. ఈ పుస్తక ప్రదర్శనలోని పలు స్టాళ్లలో వీటిని ఎక్కువ రేటుకు విక్రమయిస్తున్నారు. మరోవైపు భగవద్గీత, ఖురాన్ వంటి పవిత్ర గ్రంధాలను కేవలం 10 రూపాయలకే ఇక్కడ అందించటం గమనార్హం.