మోడీగారి మోడర్న్ టెక్నిక్స్

March 04, 2015 | 03:54 PM | 63 Views
ప్రింట్ కామెంట్
Mobile_App_Marketing_Part_niharonline

ఒక్క మొబైల్ చేతిలో ఉంటే ఎన్నో పనులు క్షణాల్లో చేసుకోవచ్చునని ప్రకటనల్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు దేశ ప్రజల సౌకర్యం కోసం ప్రధాన మంత్రి కొత్త టెక్నిక్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)కు నేరుగా సంప్రదింపుల కోసం కొత్త మొబైల్ యాప్ ను రూపొందించబోతున్నారు. ఈ అప్లికేషన్ ను ఆన్ లైన్ దిగ్గజం గూగుల్ సహాయమందిస్తోంది. Mygov.in వెబ్ సైట్ తో కలసి ఈ యాప్ తయారీలో పాల్గొంటున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడి చేసింది. ఇందు కోసం ఓ పోటీ నిర్వహిస్తున్నారు కూడా. ఈ పోటీ Mygov సైట్ లో మొదలవుతుంది. దేశంలోని పలు సంస్థలు కళాశాలల్లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఇందులో అందరూ పాల్గొనవచ్చునట. దీనిపై గూగుల్ స్పందిస్తూ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తమ సంస్థ భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ప్రతి ఒక్కరూ ఈ యాప్ రూపొందించే కార్యక్రమంలో భాగం కావాలని కోరింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ