నవ్వుకోకండి... ఇది నిజం. బహుశా ఇలాంటి కేసు నమోదవ్వటం ఇదే ప్రథమం కాబోలు. ఆశ్చర్యంగా తోచిన నమ్మక తప్పదండీ బాబు. ఢిల్లీలోని ప్రముఖ దేవాలయం కాకాజీ కి దర్శనానికి కాన్పూర్ కు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో సహా వచ్చాడట. బయట తన బ్రాండ్ షూను వదిలి టోకెన్ తీసుకుని మరీ దర్శనానికి వెళ్లాడట. తిరిగి వచ్చి చూసేసరికి అతని షూ కనిపించలేదు. దీంతో తీవ్ర అసహానానికి, ఆగ్రహానికి లోనైన అతను ఆలయ నిర్వాహకులపై చిందులు తోక్కాడు. అంతటితో ఆగాడా! ఆ ఆవేదనతో పోలీసు ఫిర్యాదు కూడా ఇచ్చాడు. పాపం అతడి బాధను చూడలేక పోలీసులు కూడా సీరియస్ గానే స్పందించారు. కేసు నమోదు చేసి వెంటనే రంగంలోకి దిగారు. అంతే అనుకోకండీ... ఓ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కూడా.