కోరిక తీర్చలేదని ప్రేయసిని పైశాచికంగా చంపాడు

March 12, 2015 | 11:38 AM | 74 Views
ప్రింట్ కామెంట్
auna_murdered_by_boyfriend_dinesh_niharonline

ప్రేమంటే మనస్సుకు సంబంధించింది కానీ, శరీరానికి సంబంధించింది కాదని ఆ మూర్ఖుడు గ్రహించలేకపోయాడు. ఈ క్రమంలోనే ప్రేమించిన యువతిని లైంగిక చర్యకు ఉపక్రమించాల్సిందిగా కోరాడు. దీనికి ఆ యువతి ఒప్పుకోపోవడంతో దారుణానికి తెగబడ్డాడు. గొంతు నులిమి, గోళ్లతో రక్కి ఆమెను కిరాతకంగా చంపేశాడు. రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగిన అరుణ హత్య కేసులో పోలీసులు మిస్టరీ ని చేధించారు. తలమై శయలగం కాలనీకి చెందిన ఉద్యోగి దినేష్ తన ప్రేయసి అయిన అరుణను దారుణంగా హత్య చేశాడు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటున్న వారిద్దరి మధ్య ప్రేమ చింగురించింది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో దినేష్ తండ్రి ఆసుపత్రి పాలయ్యాడు. ఇక తండ్రికి తోడుగా దినేశ్ తల్లి, సోదరి ఆస్పత్రిలో ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న దినేశ్ అరుణను ఇంటికి ఆహ్వానించాడు. తన కోరిక తీర్చాల్సిందిగా ఆమెను కోరాడు. దీనికి ఆమె నిరాకరించటంతో లైంగిక దాడికి యత్నించాడు. ఆమె తిప్పికొట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయి పక్కనే ఉన్న పూల కుండీతో కోట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిమి..గోళ్లతో రక్కి... పైశాచికంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకునేందుకు అరుణ శతవిధాల ప్రయత్నించిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్దారించారు. ఆ తర్వాత శవాన్ని తరలించేందుకు కారు కూడా ఏర్పాటు చేసుకున్నాడని, కానీ ప్రయత్నం విఫలం కావటంతో అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఇక ఆమెను హత్య చేసిన అనంతరం సెల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలి పారిపోయాడు. దీంతో దినేశ్ ను కనక్కోవటం పోలీసులకు కష్టంగా మారింది. అతడి కోసం నాలుగు బ్రుందాలతో గాలింపు చేపడుతున్నామని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ